చదివినవి పరీక్షలలో గుర్తుండాలంటే? 1 m ago
విద్యార్ధులు పాఠాలను ఎప్పటికప్పుడు చదివి మంచి మార్కులు సాధించాలనుకుంటారు. కానీ పరీక్ష రాసే సమయానికి చదివినవన్నీ మర్చిపోకుండా గుర్తుండాలంటే.... ముందుగా కావలసినది ఏకాగ్రత. ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో నేర్చుకున్నట్లయితే చదివింది మర్చిపోలేరు. ఒకేసారి ఎక్కువ పాఠాలను చదివితే త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఏకాగ్రతతో చదివి తర్వాత దాన్ని సమీక్షించుకుంటే బాగా అర్ధమవుతుంది.